అర్ధచంద్రాసనం
ఉపయోగాలు
కీళ్లు , వెన్ను , తొంటి ఎముకుల్లో వచ్చే చాలా సమస్యలకు రోజువారీ పనుల్లో మనం వుండే భంగిమలు కారణం , నడకలోను , కూర్చోవడంలోనూ అలాగే ఇతర బంగిమల్లోని లోపాలను చాలా మంది గుర్తించారు . అలా కొన్ని ఏళ్లపాటు కొనసాగిన ఆ లోపాలతో ఎప్పుడో మోకాళ్ళు, వెన్ను తొంటి సమస్యలు మొదలవుతాయి . కీళ్లు వెన్నుపూసలు పక్కకు జరిగినప్పుడు వాటికి దగ్గరగా వుండే నరాల మీద ఒత్తిడి పడుతుంది . ఫలితంగా స్పాండిలోసిస్ సమస్యలు గానీ, సయాటికా సమస్యలు గానీ తలెత్తుతాయి . ఓ 35 ఏళ్లుదాటిన వారిలో ఎక్కువుగా ఈ సమస్యలు కనిపిస్తాయి . నొప్పిగా ఉన్న ప్రతి సారి పెయిన్ కిల్లర్లు వేసుకుంటూ కొందరు కాలయాపన చేస్తుంటారు . దీనివల్ల అలసర్ల వంటి ఇతర సమస్యలు మొదలవుతాయి . ఆ పరిస్థితి రాకుండా కీళ్ల సమస్యలను నివారించడంలో అర్ధచంద్రాసనం గొప్పగా తోడ్పడుతుంది
ఎలా వేయాలి ?
నిటారుగా రెండు పాదాలకు మధ్య రెండు అడుగులు దూరం ఉండేలా నిలవాలి . ఆ తరువాత రెండు భుజాలను అడ్డంగా చాచి ఉంచాలి . ఆ తరువాత గాలి పిలుస్తూ శరీరం బరువంతా కుడికాలు మీద మోపి కుడిపక్కకు శరీరాన్ని వంచుతూ కుడిచేయి మునివేళ్ళను నెల మీద మోపాలి . ఆ చేయికి సమాంతరంగా ఎడమ చేయిని కూడా నిటారుగా పైకి లేపాలి . ఆ సమయంలో ఎడమకాలిని నిటారుగా పైకి లేపాలి . ఆ వెంటనే గాలిని వదిలేసి అలా 30 క్షణాల పాటు ఉండిపోవాలి . ఆ తరువాత గాలి పిలుస్తూ ఎడమ కాలిని నేలమీదకి తీసుకు రావాలి . కొద్దీ క్షణాల పాటు విరామం తీసుకొని ఈ సారి ఎడమ కాళీ మీద శరీరం బరువును మోపుతూ ఎడమచేతి మునివేళ్ళను నెల మీద మోపాలి . ఈ ఆసనాన్ని క్రమంతప్పకుండా రోజు వేస్తే కీళ్ల సమస్యలు చాలా వరకు తగ్గుతాయి . కిళ్ళతో పాటు వెన్ను భాగంలోని కండరాలు కూడా గట్టి పడతాయి . దీని వల్ల వెన్నుపూసల మీద పడే భారం తగ్గి డిస్కుల్లో వుండే సమస్యలు క్రమంగా కనుమరుగవుతాయి
మరికొన్ని ఉపయోగకరమైన ఆసనాలు :
google ads