హలాసనం


ఉపయోగాలు

శరీరంలోని అతి కీలక భాగాలైన గుండె, మెదడు, శ్వాసకోశాలను చైతన్యపరిచే శక్తి హలాసనానికి ఉంది . అందుకే యోగాసనాలతో హలాసనానికి మాతృస్థానాన్నిచ్చారు . గంటలపర్యంతం కంప్యూటర్లుపైన పనిచేసే వారికి మరేదైనా టాబిలెవర్క్స్ చేసే వారికి ఈ ఆసనం చాలా ఉపకరిస్తుంది . ఎక్కువ గంటలు కదలకుండా కూర్చునే వారిలో చాతీ వెన్నెముఖ భాగాల్ని తిరిగి చైతన్యపరచడానికి హలాసనం బాగా తోడ్పడుతుంది. . ఈ ఆసనంలో మీద , భుజాలకు కూడా రక్తప్రసరణ పెరుగుతుంది . ఫలితంగా భుజాలు సమస్యలు కూడా తగ్గుతాయి . శ్వాసకోశాల పనితనం పెరుగుతుంది . కొంతమేరకు ఈ ఆసనం థైరోయిడ్ గ్రంధిని కూడా ఉతేజితం చేస్తుంది .

full asana

ఎలా వేయాలి ?

నెల మీద పడుకుని కాళ్లు చేతులును నిటారుగా చాచి ఉంచాలి . రెండు మూడు సార్లు బలంగా శ్వాసతీసుకుని వదిలేయాలి . ఆ తర్వాత గాలి పీల్చుకుంటు రెండు కాళ్ళను నిటారుగా పైకి లేపాలి . ఈ సమయంలో రెండు చేతులను వీపుకు ఇరువైపులా సప్పోర్టుగా ఉంచాలి . కాళ్ళను పైకి లేపిన తర్వాత కొద్దీ క్షణాలు అలాగే ఉంది పీల్చిన గాలిని వదిలేస్తే నిదానంగా కాళ్ళను తల వెనుక భాగం వైపుకు వంచుతూ పాదాల మునివేళ్ళను నేల మీద మోపాలి . అలా ఒకటి రెండు నిమిషాలు ఉంది కాళ్ళను నెల మీద నుంచి లేపుతూ నిటారుగా నిలబెట్టాలి . ఆ తర్వాత గాలి పీల్చి వదిలేస్తే కాళ్ళను నేల మేధకు వాల్చాలి . ఈ ఆసనాన్ని రెండు మూడు సార్లు వేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది

మరికొన్ని ఉపయోగకరమైన ఆసనాలు :


google ads