full asana

యోగ నియమనిభంధములు


1. భోజనం చేసిన వెంటనే ఆసనములు వేయరాదు. భోజానం చేసిన 4 గంటల తరువాత, అల్ఫహరానంతరం కనీసం 2 గంటల వ్యవధి వుండవలెను. ఉత్తేజ కరములైన పానీయాలను సేవిచరాదు.

2. స్నానము ముందుగాని, తరువాతగాని ఆసనాలు చేయవచ్చును. కానీ రెండిటి మద్య అరగంట వ్యవధి వుండవలెను.

3. శారీరక వ్యాయామాలను,ఆసనములను వెంటవెంటనే వరుసగా చేయరాదు. వాటిమద్య ఆవసరమైనంత కాలము శవాసనం చైయవలెను.

4.ఆసన స్థితి ముందు దేహమును విశ్రమింప జేయుట అవసరము. రెండు ఆసనముల మద్య కొన్ని నిమిషాల వ్యవధి అవసరము.

5.ఆసనాలు వేసిన తరువాత ఊల్లాసంగా, చైత్యనము ననుభవింప వలెను గాని. ఆయాసము, ఒడలిక, స్వధానము పొందరాదు .

6. ఆసనం యొక్క చివరి దశలో వునపుడు శక్తీ ని మించి ప్రయత్నిమ్చారదు. ప్రగతి ననుసరించి, కాలమును పెంచుకుంటూ పోవలెను.

7. ప్రతి రోజు క్రమము తప్పకుండ ఆసనాలు చేయవలెను.

8. స్రీలు ఋతు సమయంలో ఆసనాలు వేయరాదు. గర్భిణి స్రీలు 5 వ నెల తరువాత నుండి ఆసనాలు చేయడం ఆపవలెను. ప్రసవానంతరం 2 లేక 3 నెలల తరువాత వైద్య నిపునణుని సలహా ఫై తిరిగి ప్రారంభింపవలెను.


google ads