జఠర పరివర్తనాసనం


ఉపయోగాలు

పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు శరీరంలోని ఇతర బాగాల్లోని కొవ్వు కన్నా ఎక్కువ ప్రమాదం పొట్ట లోని కొవ్వు నుంచి వచ్చే కొన్ని రసాయనాలు ఇన్సులిన్ పనిచేయకుండా చేస్తాయి. దీనివల్ల శరీరంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగిపోయి మధుమేహం వ్యాధికి దారితీస్తుంది. ఈ జఠరపరివర్తనాసనం పొట్టలోని కొవ్వును కరిగించడంలో మహాదిట్ట. అలాగే క్లొమగ్రంధి, ప్లీహాగ్రంధి వంటి జీర్ణాశయ అవయవాలను ఈ ఆసనం ఉత్తేజితం చేస్తుంది పేగులను శక్తివంతం చేసి కడుపు ఉబ్బరం వంటి సమస్యలను కూడా నివారిస్తుంది . నడుము, తొంటి బాగాల్లోని బెణుకులు కూడా ఈ ఆసనంతో తొలగిపోతాయి.

full asana

ఎలా వేయాలి ?

* నేల మీద వెల్లకిలా పడుకోవాలి.
* ఊపిరి వదిలి రెండు కాళ్ళను నిటారుగా పైకి ఎత్తాలి. మోకాళ్ళు వంగకుండా నేలకు నిలువుగా ఉండాలి.
* రెండు చేతులూ ఇరుపక్కలా భుజాల వరుసలో ఉండాలి.
* ఈ స్థితిలో ఉండి కొన్ని సారులు ఊపిరి పీల్చుకుంటూ ఉండాలి. ఆ తరువాత ఊపిరి వదిలి రెండు కాళ్ళను నిదానంగా ఎడమ పక్కకు వంచుతూ నేలమీదకుచేర్చాలి. పాదపు వేళ్ళుచాచి ఉంచిన ఎడమ చేతి వేళ్ళ కొనలను తాకాలి.
* కిందకు దించుతునపుడు రెండు కాళ్లు కలిసే ఉండాలి. మోకాళ్ళు వంగకూడదు. వీలైనంత వరుకు వీపు భాగం నేల మీదనే ఉంచి నడుము భాగం నుంచి మాత్రమే పక్కకు కదల్చాలి కాళ్లు చాచి ఉంచి చేతి దగ్గరుకు వచ్చినప్పుడు కడుపు భాగాన్ని కుడివైపుకు జరపాలి.ఈ స్థితిలో 20 క్షణాలు ఉండాలి. ఈ సమయంలో కాళ్లు ముడుచుకోకుండా నిటారుగా ఉండాలి.తరువాత ఊపిరి వదులుతూ పూర్తిగా వెల్లకిలా తిరుగుతూ కాళ్ళను నెల మీద నిటారుగా ఉండాలి. రెండు మూడు సార్లు గాలి పీల్చి వదిలేయాలి. ఆ తరువాత రెండు కాళ్ళను కుడి వైపునకు కూడా అలాగే వంచుతూ ఈ ఆసనం వేయాలి.

మరికొన్ని ఉపయోగకరమైన ఆసనాలు :


google ads