తలనొప్పి నివారణకు సుప్తబాధ కొనాసనం


ఉపయోగాలు

తలనొప్పులు సుమారు 350 రకాలు. వీటిలో శారీరక మానసిక ఒత్తిళ్ల కారణంగా వచ్చే తలనొప్పులే ఎక్కువ. ఒత్తిళ్ల తీవ్రత పెరిగినప్పుడు ముఖం, మెడ భాగాల్లోని రక్తనాళాలు కుచించుకుపోతాయి. లేదా వాటిలో వాపు ఏర్పడుతుంది. ఈ స్థితిలో చాలా మంది వెంటనే కాఫీ తాగేస్తారు. కాఫీ తాగడం వల్ల నాళాల్లో ఏర్పడిన వాపు తగ్గిపోయి ఉపశమనం లభిస్తుంది. కానీ ఇది తాత్కాలికమే. కాఫీ ప్రభావం తగ్గగానే నాళాల్లో అంతకు ముందున్న వాపు కన్నా రెట్టింపుగా వాపు ఏర్పడుతుంది. వెంటనే తలనొప్పి కూడా రెట్టింపు అవుతుంది. అలాగే, హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, నిద్రలేమి, వాతావరణ మార్పులు, కొన్ని రకాల ఆహారపు అలవాట్ల కారణంగా కూడా తలనొప్పి రావచ్చు. తలనొప్పి కలిగించే ఆ ఆహారపదార్ధాలేమిటో గుర్తించి వాటిని దూరంగా ఉంటే ఆ కారణంగా వచ్చే సమస్యలనుంచి బయటపడవచ్చు. ఒత్తిళ్ల కారణంగా వచ్చే తలనోప్పుల కైతే సుప్త భాద కొనాసనం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

full asana

ఎలా వేయాలి ?

రెండు మీటర్ల కన్నా పొడవైన ఒక బెల్టును దగ్గరలో ఉంచుకోవాలి. ఆ తరువాత రెండు పొడవాటి దిండ్లను తీసుకోవాలి. ఒక దిండును నిలువుగా నేల మీద ఉంచాలి. దాని మీద మరో దిండును అడ్డంగా ఉంచాలి. ఆ తరువాత నేల మీద నిలువుగా వున్నా దిండు ముందు కూర్చోవాలి. రెండు అరిపాదాలు కలిసేలా కాళ్లను దగ్గరకు చేర్చుకోవాలి. పాదాలు, నడుము చుట్టూ బెల్టును బిగించాలి. ఆ తరువాత మెడవరకు నేల మీద ఉన్న దిండు మీద, తలను పై నున్న దిండు మీద ఉంచాలి. శ్వాసక్రియ మామూలుగానే సాగుతూ ఉంచాలి. అలా 5 నుంచి 10 నిమిషాల పాటు సేద తీరితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

మరికొన్ని ఉపయోగకరమైన ఆసనాలు :


google ads