యోగ వలన ఉపయోగాలు
యోగా యోగాభ్యాసం పరిమితి పరిమాణాలను గురించి ప్రాధమిక వివేచనను ప్రేరేపిస్తుంది. భౌతికంగా గరిష్ట స్పందనను, సామరస్యాన్ని సాధించడానికి, దేహాన్ని ఉపకరణంగా మలుచుకోవడానికి సహకరిస్తుంది. అచంచల దీక్షతో కూడిన అనుదిన సాధన వలన దేహంలోని ప్రతికణము శుద్ధమై, చైతనవంతమవుతుంది. దీనివల్ల నిర్జీవము నిర్వీర్యమై మరుగుపడిన శక్తి సామర్ఢ్యలు ఉజ్జివనం కాగలవు.
శారీరక, మానసిక అస్వస్థతను నివారించి దేహాన్ని సంరక్షించుకునేందుకు, తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని అలవర్చుకునేందుకు స్వశక్తి పై ఆధారపడేందుకు, యోగసాధన సర్వవిధాలా అనుకూలమైనది. విశ్వజనీత సూత్రాలతో స్వతసిద్ధమైన అనుభంధం గలది. మనః ప్రశాంతతో, సంకల్పబలంతో, నిర్మలుడై సాధకుడు తీసుకునే శ్వాసలో ఙివితంపట్ల శ్రాధ, సత్యదృష్టి, సంయమం అనివార్యంగా అతర్లీనమై ఉండగలవు.
యోగ విద్యలో నిక్షిప్తం అయినా నైతిక సూత్రాలు విశ్వధర్మంలోనే ఉన్నాయి. కనుక, సంపూర్ణ వక్తిత్వా వికాసానికి దోహదం చేసే ప్రయత్నం, సమగ్ర కృషి దీనికి అవసరం.
google ads