భుజంగాసనం
ఉపయోగాలు
మన శరీరంలో ఎక్కువ సమయాల్లో ముందుకు వంగే ఉంటుంది. కూర్చున్న, నిలుచున్నా, వాహనం నడుపుతున్నా అలా ముందుకే వంగే ఉంటాం. దీని వల్ల వెన్ను పూసలు మీద భారం పెరుగుతుంది. అది క్రమంగా డిస్కులు దెబ్బ తినడానికి వెన్నెపాములోనొప్పి రావడానికి దారి తీస్తుంది. గతంలో అప్పుడో 60 ఏళ్ళ తరువాత మొదలయ్యే ఈ వెన్ను సమస్యలు ఇటీవలి కాలంలో పాతికేళ్ల నుంచే తెలెత్తుతున్నాయి. రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేసే వారిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ఈ స్థితికి మనం ఎక్కువగా ముందుకు వంగి కూర్చోవడమే ప్రధాన కారణం. తొలిదశలోనే ఈ విషయంలో జాగ్రత్త వహించక పోతే ఒక్కోసారి ఇది శస్త్ర చికిత్సల దాకా వెళుతుంది. ఈ సమస్య నివారణకు ప్రతి రోజు శరీరాన్ని వెనక్కి వంచడమే సరైన మార్గం. అందుకు చాల ఉత్తమమైన సాధనం భుజంగాసనం. వెన్ను సమస్యలను చక్కదిద్దడంతో పాటు ఈ ఆసనం వల్ల శ్వాసకోశాలు, నాడీ వ్యవస్థ కూడా చెక్కబడతాయి. ఈ ఆసనంలో మనిషి తలారిక్కించిన పాములా కనబడుతాడు. అందుకే ఈ ఆసనానికి ఆ పేరు స్థిరపడింది.
ఎలా వేయాలి ?
నేల మీద బోర్లా పడుకొని రెండు చేతులను మడిచి మెడకు ఇరువైపులా ఉంచాలి. ఆ తరువాత అరిచేతులను నేల మీద మోపి గాలి పిలుస్తూ అరిచేతుల ఆధారంగా శరీరాన్ని నడుము దాకా పైకి లేపాలి. అలా ఒకటి రెండు నిముషాలు పాటు ఉంచి గాలిని వదిలేస్తూ మోకాళ్ల మీద నిలుచోవాలి. క్రమంగా కాలి మడమల మీద నడుము వాల్చి కాసేపు సేద తీరవచ్చు. కొన్నాళ్ల సాధన తరువాత అలా రెండు మూడు సార్లు కూడా చేయవచ్చు.
మరికొన్ని ఉపయోగకరమైన ఆసనాలు :
google ads