full asana

ప్రాణాయామము


సలహాలు - సూచనలు

అర్హతలు లక్షణాలు :

1. ప్రాణాయామ అభ్యస్యానికి, యోగాసనాలలో ప్రావిణ్యం తద్వారా సంక్రమించిన క్రమశిక్షణ అంత అవసరం.

2. ప్రాణాయామ సాధనలో ప్రవేశం, ప్రావిణ్యం పొందడానికి సుశిక్షితుడైన గురువు ప్రతక్ష పర్యవేక్షణ అవసరం.

3. ప్రాణాయామ సాధనలో సాధకుని ఉపకరణాలు అతని ఊపిరితిత్తులు. వాటిని సక్రమంగా వినియోగించుకోలేక పోతే, అవి శిధిలమై పోవడమేకాదు, మనిషికి కూడా నశింపజేస్తుంది. ఇది ప్రాణాయామానికి సంబంధించిన వాస్తవం.

ఆహారం శుచి :

4. ప్రాణాయామ ప్రారంభానికి ముందు, మలమూత్ర విసర్జన క్రియ పూర్తి చేయాలి. అప్పుడు వివిధ బంధాలు ఆచరిస్తున్నపుడు అసౌకార్యం ఉండదు.

5. ప్రాణాయామం చేస్తున్నపుడు కడుపు ఖాళీగా ఉండటం మంచిదే కాకపోతే, ఒక కప్పు పాలు లేదా కాఫి, టీ, కోకో ఏదైనా సేవించవచ్చు. భోజనంతరం ఆరుగంటల విరామం తరువాత ప్రాణాయామం చైయవచ్చు.

6. ప్రాణాయామ సాధనకు అరగంట వ్యవధి తరువాత తేలికైన ఆహారం తీసుకోవచ్చు.

స్థలం కాలం :

7. ప్రాణాయామం చేయడానికి అనువైన వేళలు, సూర్యోదయం లేదా సూర్యాస్తమయానంతరం

8. శుభ్రమైన గాలి, వెలుతురు ఉండి, క్రిమికీటకాలు లేని ప్రదేశాన్ని ఎంచుకోవాలి. శబ్ద కాలుష్యం లేని సమయాలను ఎంపిక చేసుకోవాలి.

9. ధృడసంకల్పంతో, నియమం తప్పకుండా, రోజు ఒకే స్థలంలో, ఒకే సమయంలో, ఒకే ఆసనంలో, ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామ విధానాన్ని మార్పు చేసుకోవచ్చు. అంటే ఒకరోజు సూర్యభేదన ప్రాణాయామం, మరునాడు శీతలి, మూడవరోజు భస్త్రిక .. ఇలా మార్చుకోవచ్చు. అయితే నాడీశోధన ప్రాణాయామం విధిగా రోజు చేయాలి.

భంగిమ :

10. శీతలి, శీతకారి ప్రాణాయామం మినహా, మిగిలిన ప్రాణాయామ విధానాలన్నింటిలోనూ, ముక్కు ద్వారా మాత్రమే గాలి పీల్చుకోవాలి.

11. ముడత వేసిన కంబళి పై కూర్చుని ప్రణయం చేయడం ఉత్తమం. సిద్ధాసనం, విరాసనం, పద్మాసనం, బద్ధకోణాసనం ఇవ్వని ప్రాణాయామానికి అనుకూలం. కూర్చునే భంగిమ దేనినైనా ఎంపిక చేసుకోవచ్చు. కానీ, ఆ భంగిమలో కూర్చున్నపుడు వెన్నెముక మూలం నుంచి మెడవరకూ, నిటారుగా ఉండాలి. ఏమాత్రం వంగకూడదు. కొన్ని రకాల ప్రాణాయామాలు వెనుకకు వాలిన భంగిమలోనైనా చేయవచ్చు.

12. ప్రాణాయామం చేస్తున్నపుడు ముఖకండరాలలో, కళ్లు, చెవులలో, మెడ కండరాలలో, భుజాలు, చేతులు, తొడలు, కాళ్ళు ఏ భాగంలోనూ శ్రమ, బాధ కలుగకూడదు. తొడలు, చేతులను ప్రయత్నపూర్వకంగా విశ్రాంతిగా ఉంచాలి. ప్రాణాయామంలో మనకు తెలియకుండానే అవి ఉత్తేజితం కాగలవు.

13. నాలుక కదిలించరాదు, లెకఫోతే, నోటిలో లాలాజలం ఊరుతుంది. నోటిలో లాలాజలం స్రవిచినపుడు, రేచకం చేసే ముందు దానిని మింగివేయాలి. కుంభక సమయంలో మింగరాదు.

14. ప్రారంభంలో వణుకు, చెమటలు వచ్చినా కాలక్రమేణా అవి తగ్గిపోతాయి.

15. ప్రాణాయామ అభ్యస సమయంలో కన్నులు మూసుకొని ఉండటం చాలా అవసరం, బాహ్య ప్రపంచాన్ని చూస్తుంటే మనస్సు చలించే అవకాశం ఉంది. అంతేకాక కన్నులు తెరిచి ఉంచితే మంటపుట్టే ఆస్కారం ఉంది.

16. ప్రాణాయామ సమయంలో చెవులు దిబ్బడ వేసుకోవడంగాని, చెవులలో వత్తిడి అనిపించడంగాని జరుగరాదు.

17. ప్రాణాయామం చేసే సమయంలో సాధకుడు తన శక్తిని, సామర్ధ్యాన్ని గుర్తించాలి. అవధులు దాటకూడదు. ఉదాహరణకు : ఒక్కొక ఆవృత్తంలో ఉచ్ఛ్వాసానికి, నిశ్శ్వాసానికి పదేసి సెకన్ల కాలం చొప్పున 5 నిమిషాల పాటు శ్రమలేకుండా చేయగలిగినవారు కొద్దీ సమయం తరువాత ఉచ్ఛ్వాసానికి 7,8 సెకన్ల మాత్రమే వెచ్చించగలుగుతుంటారు. అంటే, వారి శక్తి పరిమితిని చేరినట్టేనని గ్రహించాలి. కనుక, పరిమితికి మించి అభ్యసం కొనసాగిస్తే ఊపిరితిత్తులు పాడైపోయి, అనేక శ్వాసకోశ వ్యాధులు సంక్రమిస్తాయి.

18. సాధన సక్రమంగా ఉండకపోతే, ఊపిరితిత్తులకు, క్లోమమునకు శ్రమకారుగుతుంది. నాడి మండలం, శ్వాసకోశం దెబ్బతింటాయి. ఆరోగ్యమైన శరీరానికి, ప్రశాంతమైన మనస్సుకు అవసరమైన ప్రాతిపదిక నిర్వీర్యమవుతుంది. బలవంతంగా చేసే ఉచ్ఛ్వాసనిశ్శ్వాసాలు హానికరం.

19. ఉచ్ఛ్వాసనిశ్శ్వాసాలు సమంగా ఉండటం వలన, నరాల ఉద్రిక్తత తగ్గి, మనస్సు సమస్థితిలో ఉండగలదు.

20. ప్రాణాయామం చేసిన వెంటనే ఆసనాలు వేయకూడదు. ముందుగా ప్రాణాయామం చేసినట్లైతే, ఒక గంట విరామం అనంతరమే ఆసనాలు వేయాలి. అలా చేయకపోతే, ప్రాణాయామం వలన శాంతి చెందిన నరాలు, ఆసనాల కదిలికల వలన ఉద్రిక్తం కావచ్చు.

21. ఆసనాలు అభ్యసం మందకొడిగా ఉన్నపుడు కనీసం 15 నిమిషాల విరామం తరువాత మాత్రమే ప్రాణాయామం చేయాలి.

22. ఆసనాలు కొన్ని వేసినపుడు దేహం అలసిపోతుంది. ఈ సమయంలో అలసట వలన వెన్నెముక నిటారుగా ఉండలేదు. దేహం వణుకుతుంది. మనస్సు చికాకుగా ఉంటుంది. ఈ సమయంలో వెనుకకు వాలి కూర్చుని ఉజ్జయిలో వలె, గాఢ శ్వాసక్రియ చేసినట్లయితే అలసట దూరమవుతుంది.

23. శ్వాసక్రియ - గాఢంగా, నిలకడగా, దీర్ఘంగా, లయబద్ధంగా చేయలేకపోతే, వెంటనే సాధన నిలిపి వేయాలి, కొనసాగించరాదు. ఉచ్ఛ్వాసనిశ్శ్వాసాలలో వినిపించే నాదాన్ని బట్టి, శ్వాసలోని లయను నిర్ధరించవచ్చు. శ్వాస పిలుస్తున్నపుడు, స్ స్ స్ సా.. అని, శ్వాస శ్వాస వదిలిన్నపుడు హు హు హు ...హు అనీ శబ్దం రావాలి. సైకిల్ గొట్టం రంద్రం నుంచి వెలువడే శబ్దం వంటిది.ఉచ్ఛ్వాసనాదం స్థాయి తగ్గిపోతే వెంటనే సాధన ఆపాలి.

24. పూరక, రేచకల అవధి సమయంలో ఉండేలా చూసుకోవాలి. ఊదాహరణకు ఒక ఆవృత్తంలో ఒకదానికి 5 సెకన్లు కేటాయిస్తే, రెండోవాదానికి కూడా అంతే వ్యవధి నిర్ధేశించుకోవాలి.

25. ఉజ్జయి, నాడీశోధన, ప్రాణాయామం, అన్నిటికంటే ప్రయోజనకరమైన విధానాలు, ముఖ్యంగా గర్భిణీలు బద్ధకోణాసనంలో వీటిని అభ్యాసం చెయ్యడం మంచిది, కానీ, గర్భిణీలు గురువు ప్రతీక్ష పర్యవేక్షణ లేనిదే కుంభకం చేయకూడదు.

26.ప్రాణాయామం తరువాత విధిగా నేలమీద శవాసనం లో పనుకోవాలి.5-10 నిమిషాలపాటు నిశబ్ధంలో గడపాలి. మనస్సును నిచ్చలం చేసుకోవాలి. అంగములు, ఇంద్రియాలు చలనరహితం కావాలి. ప్రాణాయామం తరువాత శవాసనం వేస్తే దేహము, మనస్సు ఉల్లాసవంతంగా ఉంటుంది.

27. ప్రాణాయామం నిరంతరం సాధన వలన సాధకుడి మానసిక దృక్పధం మార్పు చెందుతుంది. ధూమపానం, మద్యపానం, లైoగిక సౌఖ్యం వంటి ప్రాపంచిక సుఖాల కోసం ఇంద్రియాల చాంచల్యం తగ్గుతుంది.

28. ప్రాణాయామ అభ్యాస సమయంలో కనులు మూసుకొని ఉండి, కలగమనాన్నిగుర్తించేందుకు ఏదైనా పవిత్రమైన శబ్దాన్నిగాని, నామాన్నిగాని జపిస్తుండాలి. ఈ జపము యోగి మనస్సులోని బీజము వంటిది. ఈ బీజము పెరిగి పెద్దదై సాధకుని యోగసాధనలోని ఆరవదశ ధ్యానమునకు సమాయత్తం చేస్తుంది. చివరకు, 'సమాధి' అనే ఫలాన్ని అందిస్తుంది. సంపూర్ణ చైత్యనం, ఉత్కృష్టమైన ఆనందం - సమాధి లక్షణాలు, యోగి సృష్టికర్తలో విలీనమై, అనిర్విచనీయమైన అనుభూతిని పొందగలడు.


google ads