యోగాతో ఆరోగ్య ప్రయోజనాలు..
# ఒత్తిడి తగ్గుతుంది # శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి # బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ # వెన్ను నొప్పి తగ్గించి మెదడును చురుకుగా చేస్తుంది # బరువు తగ్గేందుకు సహాయపడుతుంది # నిద్రలేమి సహా ఇతర నిద్ర సమస్యలు నివారిస్తుంది
అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యల నివారణకు
# వామును దోరగా వేయించి వేడి అన్నంలో తింటే పొట్ట ఉబ్బరింపు బాధించదు # వేయించిన జీలకర్ర పొడిని భోజనానికి ముందు వేడినీళ్ళలో కలిపి తాగాలి # ఆహారాన్ని కొద్దిమొత్తంలో రోజుకి ఎక్కువసార్లు తీసుకోవాలి # టీ, కాఫీ, బబుల్‌గమ్ నమలడం, స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి # తినడానికి, పడుకోవడానికి మధ్య కనీసం గంటన్నర సమయం ఉండేలా చూసుకోవాలి
ఉబ్బరానికి 6 సూత్రాలు..
♢ ప్రతిరోజూ సమయానికి తినడం ♢ జీర్ణప్రక్రియ సరిగా ఉందో లేదో తెలుసుకోవడం ♢ శరీరానికి విశ్రాంతి ఇవ్వడం ♢ ఐరన్ ఉన్న ఆహారం తీసుకోవడం ♢ పండ్లు, ధాన్యాలు, కూరగాయలు తినడం ♢ శరీరానికి సరిపడా వ్యాయామం చేయడం
గుండె ఆరోగ్యానికి కావాల్సినవి..
# కొలెస్ట్రాల్ కోసం బ్లూ బెర్రీస్, ఓట్స్ తీసుకోవాలి # వాల్ నట్స్, బాదం, జీడిపప్పు తింటే రక్తం గడ్డ కట్టడం ఆపేస్తుంది # చేపలు మరియు ఇతర చేపలు తింటే ఆరోగ్యకర ఫ్యాట్ లభిస్తుంది # రక్త పోటు నియంత్రణ కోసం నారింజ, ఇతర C విటమిన్ పండ్లు తీసుకోవాలి
క్యాలీఫ్లవర్‌తో క్యాన్సర్‌కు చెక్..
క్యాలీఫ్లవర్‌తో క్యాన్సర్, గుండె సమస్యలు తగ్గుతాయట. దీనిలోని ఫినోలిక్ పథార్థం, పోషకాలు.. టైప్ 2 డయాబెటిస్, ఆస్తమాతో పాటు పలు ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుందని చికాగోలోని ఇల్లీనోస్ యూనివర్శిటీ పరిశోధకులు తేల్చారు. వారానికి మూడు, నాలుగు సార్లు ఇది తింటే ఆరోగ్యానికి మంచిదట. క్యాలీఫ్లవర్‌లోని యాంటి ఆక్సిడెంట్ శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు రక్త ప్రవాహంలో కీలక పాత్ర పోషిస్తుందట.
ఆరోగ్యాన్ని అందించే నేచురల్ జ్యూస్..
గోరువెచ్చటి గ్లాసెడు నీళ్లలలో 10 చెంచాల అల్లం రసం, 5 టీస్పూన్ల తేనె, నిమ్మరసం కలుపుకుని తయారుచేసిన జ్యూస్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయట # షుగర్ లెవల్స్ నియంత్రిస్తుంది # జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందట # కొవ్వు తగ్గించడంలో సాయపడుతుంది # ఒళ్లునొప్పులను దూరం చేస్తుంది # శరీరంలో క్యాన్సర్ కారకాల వృద్ధిని నిలవరిస్తుంది # జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులను దూరం చేస్తుంది #
రోజూ ఒక చాక్లెట్ తింటే..
రోజుకు ఒక చాక్లెట్ తింటే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయట. రోజూ చాక్లెట్ తినేవారికి గుండె జబ్బుల ముప్పు 25% వరకు తగ్గుతుందని.. అబెర్డీన్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో తేలింది. చాక్లెట్లు గుండె ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా లోబ్లడ్ ప్రెజర్‌ను తగ్గిస్తుందట. శరీరానికి అవసరమయ్యే తక్షణ శక్తిని ఇస్తుందట. అందుకే చాక్లెట్లను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
పాలకూరతో పెరాలసిస్ దూరం..
పాలకూర పక్షవాతాన్ని సమర్థవంతంగా నియంత్రిస్తుందని చైనా పరిశోధకులు చెబుతున్నారు. తాజా పాలకూరలో ఎక్కువగా ఫోలిక్ యాసిడ్‌తో హైబీపీ కంట్రోల్‌లో ఉంటుందని, దీనివల్ల పక్షవాతం రాదని చెబుతున్నారు. ఆహారంలో ఎక్కువగా పాలకూరలు, ఆకుకూరలు తీసుకోవడం వలన గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గినట్లుగా గుర్తించారు.
ఇవి తింటే బరువు తగ్గొచ్చు..
మనం ప్రతి రోజూ తినే జీలకర్రతో బరువు తగ్గొచ్చట. శరీరంలో కొవ్వును నియంత్రించగల శక్తి జీలకర్రకు ఉందట. జీలకర్రలో ఉండే 'థైమాల్' అనే రసాయనంతో పాటు అందులో ఉండే కొన్ని లక్షణాలు శరీరంలోని కొవ్వును తగ్గించడంతో పాటు జీర్ణక్రియ ప్రక్రియను సులభతరంగా మారుస్తాయట. ఒక గ్లాసు నీటిలో జీలకర్ర కలిపి వేడి చేసి రోజుకు మూడుసార్లు తాగితే డైజేషన్‌కు మంచిదట.
బట్టర్ టీ/కాఫీతో ప్రయోజనాలు..
కప్పు కాఫీ లేదా టీ లో బట్టర్ కలిపి తాగితే.. ☕ ఆకలిని తగ్గించి.. బరువు తగ్గేందుకు దోహదం ☕ రోజంతా ఉల్లాసంగా ఉంటారు ☕ గుండెనొప్పులు వచ్చే అవకాశం తక్కువ ☕ మెదడు చురుగ్గా, రిలాక్సిడ్‌గా ఉంటుంది
నోటి దుర్వాసన తగ్గుతుందిలా..
# రోజుకు 8 గ్లాసుల నీరు తాగాలి # భోజనం చేశాక తప్పనిసరిగా నోరు క్లీన్ చేసుకోవాలి # పాల ఉత్పత్తులు, మాంసాహారం తినడం తగ్గించాలి # ఫైబర్ ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి # సిగరెట్ తాగడం మానేయాలి # ఆరు నెలలకొకసారి డెంటల్ చెకప్ చేయించుకోవాలి # కనీసం రెండు గంటకొకసారైనా నోరు పుక్కిలించుకోవాలి.
Some Other Useful Yoga Aasans
google ads