విపరీత కరిణి
ఉపయోగాలు
మధుమేహం వల్ల గానీ, కొలెస్ట్రాల్ నిలువలు పెరిగిపోవడం వల్లగాని కొందరిలో రక్తనాళాలు ముసికుపోవచ్చు. ఫలితంగా కాళ్లకు రక్తప్రసరణ తగ్గి కాళ్లలో పుండ్లు ఏర్పడవచ్చు. చాలాకాలం దాకా అవి మనకపోతే ఆ భాగం పూర్తిగా క్షిణించి గ్యాంగ్రిన్ సమస్య రావచ్చు. ఏ కారణంగానైనా రక్తనాళాలు మూసుకునిపోయినప్పుడు ఆ సమస్య అంతటితో ఆగిపోదు ఆ తరువాత అది గుండెపోటుకు, పక్షవాతానికీ దారి తీయవచ్చు. ప్రధానంగా కళ్లలోని రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులతో కాళ్లల్లో భరించలేని నొప్పి మొదలవుతుంది. ఈ నొప్పిని భరించలేక కొందరు పిక్కలను తాళ్లతో బిగదీసుకుంటారు. దీనివల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. ఈ స్థితిలో భూమ్యాకర్షణకు వ్యతిరేకంగా అంటే తలక్రిందులుగా ఉండే శీర్షా ఆసనం ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. కానీ, యోగాసనాలు వేయడంలో ఎంతో అనుభవం ఉంటే తప్ప అందరూ శీర్షాసనం అసలే వేయకూడదు. అలాంటి వారికీ విపరీత కరిణి ఆసనం ఎంతో మేలు చేస్తుంది. రోజు ఈ ఆసనం వేస్తే మును ముందు రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడే స్థితి రాదు. గ్యాంగ్రిన్ తో కాళ్ళో, కాలి వేళ్ళో తొలిగించే అవసరం చాలా వరకు తప్పిపోతోంది.
ఎలా వేయాలి ?
గోడకు కొన్ని అంగుళాల దూరంలో అడ్డంగా ఒక దిండు వేసుకోవాలి. ఆ తరువాత దిండు నడుము కిందకి వచ్చేలా గోడకు దగ్గరగా కూర్చోవాలి. ఆ వెంటనే రెండు కాళ్లను దగ్గరగా చేర్చి కుడి వైపు తిరగాలి. ఆ తరువాత ముందు ఎడమకాలును ఆ తరువాత కుడికాలును గోడ మీద నిటారుగా నిలబెట్టాలి.తలను నిదానంగా నేల మీదకి చేర్చి రెండు చేతులను దిండుకు ఇరువైపులా వాల్చి సేదతీరాలి. అలా ఓ 10 నిమిషాల పాటు ఉండిపోవాలి. రోజు ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా వేస్తే కళ్ళల్లో పాదాల్లో వచ్చే పలురకాల సమస్యలు తగ్గిపోతాయి. ఇక స్ర్తీల విషయానికి వస్తే బహిష్టు సమయంల్లో ఈ ఆసనం వేయకూడదు.
మరికొన్ని ఉపయోగకరమైన ఆసనాలు :
google ads