full asana

ధ్యానం యొక్క ప్రాముఖ్యత


నీరు ఏ పాత్రలో ఉంచితే ఆ పాత్ర ఆకారం పొందినట్లు మనస్సు ఏ వస్తువు మీద లగ్నం అయితే, ఆ వస్తువు స్వరూపాన్ని సంతరించుకుంటుంది. సర్వవ్యాపకమైన దివ్యత్వాన్ని ధ్యానించే మనస్సు నిరవధిక భక్తి వలన ఆ దివ్యత్వాన్ని ధారణ చేస్తుంది.


ఏకాగ్రత నిరంతరాయంగా కొనసాగినపుడు ధ్యానస్థితి సమకూరుతుంది. అంతరాయంలేని విద్యుత్ సరఫరాతో విధ్యుత్ దీపంలో తీగ వెలిగే విధంగా, ధ్యానముతో యోగి మనస్సు తేజోవంతమవుతుంది. ధ్యాన కేంద్రమైన విశ్వాత్మలో యోగి దేహం, శ్వాస, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం సమీకృతమై విలీనం కాగలవు. యోగి, ఇదీ అని చెప్పలేని చైతన్యభూతిని పొందగలడు.


google ads