శలభాసనం


ఉపయోగాలు

ఈ ఆసనంలో మనిషి ఆకృతి మిడతలా ఉంటుంది. అందుకే ఈ పేరు స్థిరపడింది. ఈ ఆసనం వాళ్ళ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బిగుసుకుపోయిన వెన్నుముక సాగుతుంది. వెన్నునొప్పి, నడుమునొప్పి తగ్గుతాయి. వెన్నుపూస పక్కకు జరగడం వల్ల తలెత్తిన నొప్పి నుంచి ఈ ఆసనంతో ఉపశమనం కలుగుతుంది. రోజు క్రమం తప్పకుండా వేస్తే వీరికి శస్త్ర చికిత్స అవసరం కూడా తప్పుతుంది. వీటినన్నిటిని మించి ఈ ఆసనం వల్ల మూత్రకోశ సమస్యలు తగ్గుతాయి.

full asana

ఎలా వేయాలి ?

నేల మీద రెండు కాళ్లూ చాచి బోర్లాపడుకోవాలి, ముఖం నేలమీద వాల్చి చేతులు వెనుకకు చాపాలి.

ఊపిరి వదిలి, తల, ఛాతీ, కాళ్లు ఒకసారి వీలైనంత పైకి ఎత్తాలి. పక్కటెముకలు గానీ, మోచేతులుగాని నేల మీద ఆనకుండా కేవలం పొట్ట మాత్రమే నేల మీద ఉండి శరీరం బరువునంతా మోస్తూ ఉండాలి.

పిరుదు కండరాలను సంకోచింపచేసి, తొడల దగ్గర కండరాలను సాగతీయాలి. రెండు కాళ్లను పూర్తిగా చాపి ఉంచాలి. తొడల దగ్గర మొకాళ్ళు, చీల మండలాలు తాకుతూ ఉండాలి.

శరీరం బరువును చేతుల మీద మోపకూడదు. ఈ స్థితిలో ఒకటి రెండు నిముషాలు ఉండాలి, శ్వాసక్రియ మామూలుగానే ఉండాలి.

ప్రారంభంలో ఛాతీని, కాళ్లను పైకి ఎత్తడం కష్టమనిపించినా కొన్నాళ్ల సాధన తరువాత అది సులువవుతుంది.

నడుము కింద నొప్పి ఎక్కువగా ఉన్నవారు ఈ ఆసనంలో కాళ్లను వెనుకకు ముడుచుకోవాలి. తొడలను ఎడం చేసి నేలకు నిలువుగా ఉండాలి.

మరికొన్ని ఉపయోగకరమైన ఆసనాలు :


google ads