పవన ముక్తాసనం
ఉపయోగాలు
వాతావరణ కాలుష్యాల వల్ల గాని మన శరీరంలో పేరుకు పోయిన వ్యర్థ పదార్థాలు వల్ల గాని మన జీర్ణ వ్యవస్థలో హానికర వాయువులు తయారవుతాయి. ఏళ్ల పర్యంతంగా ఈ సమస్య ఇలాగే కొనసాగితే రక్తంలో ఆక్సీజన్ శాతం తగ్గిపోతుంది
ఫలితంగా గుండె, లివర్, కిడ్నీలు, మెదడు వంటి శరీరంలోని కీలక భాగాలు రోగ గ్రస్తమవుతాయి. మెదడు పనితనం తగ్గిపోయి జ్ఞాపక శక్తితో పాటు కార్యదక్షత కూడా తగ్గిపోతుంది. తరుచు తలనొప్పి, తాన్పులతో మనిషి అసహనానికి ఆందోళనకు గురవుతూంటాడు. అతి సాధారణంగా మొదలైన ఈ సమస్య క్రమంగా మనిషి గమనమే కుంటుపడేలా చేస్తుంది. శారీరక వ్యాయామాల పట్ల చూపే నిర్లక్ష్యమే ఈ సమస్యలన్నిటికీ కారణంగా ఉంటుంది. ఈ సమస్యల నుంచి పవన ముక్తాసనం సునాయాసంగా విముక్తి చేస్తుంది.
ఎలా వేయాలి ?
రెండు చేతులును నేల మీద చాచి ఉండాలి . రెండు మూడూ సార్లు గాలి పీల్చి వదిలేయాలి . ఆ తరువాత ఒకసారి బలంగా గాలి పిలుస్తూ రెండు కాళ్ళను మడిచి మోకాళ్ళను పొట్టమీదకు తీసుకురావాలి . ఈ సమయంలో ముడుచుకుని ఉన్న కాళ్ళను రెండు చేతులతో బంధించాలి . ఆ తరువాత కాళ్ళను మరింతగా వంచి కంఠం దాకా తీసుకురావాలి అలా రెండు మూడుసార్లు చేస్తే కడుపులోని వాయువులన్నీ బయటికి వెళ్లిపోతాయి . దీని వల్ల కడుపు ఉబ్బరంతో వచ్చే సమస్యలన్నీ మాయమవుతాయి . ఆ ఆసనంతో పాటు ద్రవాహారాలకు ప్రాధాన్యత ఇస్తే రెట్టింపు ఫలితాలు లభిస్తాయి
మరికొన్ని ఉపయోగకరమైన ఆసనాలు :
google ads