పద్మాసనం
ఉపయోగాలు
ఈ ఆసనం వేసే తొలిరోజుల్లో కాళ్లు నొప్పి అనిపించినా ఆతరువాత ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. శరీరానికి ఎంతో విశ్రాంతి లభిస్తుంది. కాళ్లు ఒకదాని మీద ఒకటి వేసుకోవడం వల్ల వెన్నెముక నిటారుగా ఉంటుంది. ఫలితంగా నాడీ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. బిగుసుకుపోయిన మోకాళ్ళు చీల మండలాలను ఇది సడలిస్తుంది. నడుము, పొట్ట భాగాలకు రక్తప్రసరణ పెరుగుతుంది. పొట్టలోని అవయవాలన్నిటినీ ఇది శుద్ధి చేస్తుంది. ప్రాణాయామానికి ముందు ఈ ఆసనంలో నైపుణ్యాన్ని సాధించడం చాలా అవసరం.
ఎలా వేయాలి ?
కాళ్లు చాచి నేల మీద కూర్చోవాలి. కుడికాలు మోకాలి దగ్గర ముడిచి కుడి పాదాన్ని చేతులతో పట్టుకొని ఎడమ తొడ మూలా స్థానం దగ్గర ఉంచాలి. అంటూ కుడి మడమ బొడ్డు దగ్గరకు రావాలి. ఎడమ కాలిని కూడా మడిచి ఎడమ పాదాన్ని చేతులతో పట్టుకొని కుడి తొడ మూలస్థానం వద్ద ఉంచాలి. అరిపాదాలు పైకి తిరిగి ఉండాలి. మెడ కింది భాగం నుంచి వెన్నెముకను నిటారుగా ఉంచాలి. చేతులు చాపి కుడి చేయి కుడి మోకాలి మీద ఆనించాలి. బొటన వేళ్లు చూపుడు వేళ్లు కలిపి ఉంచాలి. కాళ్ల స్థితిని మార్చి ఎడమ పాదం కుడి తొడ మీద కుడి పాదం ఎడమ తొడ మీద ఉంచాలి.
మరికొన్ని ఉపయోగకరమైన ఆసనాలు :
google ads