భోజనం చేశాక నడిస్తే..
తిన్న తర్వాత ఓ 2ని. ఆగి కాసేపు నడిస్తే.. # బరువు తగ్గి ఆరోగ్యంగా ఉంటాం # బీపీ స్థాయి తగ్గుతుంది # రక్తంలో గ్లూకోజ్ కండరాలకు సరఫరా అవుతుంది # డయాబెటీస్ సమస్య తగ్గుతుంది # జీర్ణక్రియ వేగవంతం అవుతుంది # శరీర అవయవాలు చురుకుగా పనిచేస్తాయి
మధ్యాహ్నం నిద్రతో ప్రమాదమే..
మధ్యాహ్నం నిద్ర పోయే వారు ప్రమాదంలో ఉన్నట్లేనట. మధ్యాహ్నం అరగంట కంటే ఎక్కువ సమయం నిద్రకు కేటాయించే వారు త్వరగా చనిపోతారట. అలాంటి వారిలో సోమరితనం పెరగడంతో పాటు ఆనారోగ్యానికి గురి అవుతారని యూకేలోని కేంబ్రిడ్జి యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు. 16వేల మందిపై అధ్యయనం చేయగా 32శాతం మంది అనారోగ్యానికి గురి అయ్యారట. అలాంటి వారికి గుండెపోటు, క్యాన్సర్, శ్యాసకోస సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయట.
ఒత్తిడిని తగ్గించే ప్రకృతి..
ప్రకృతిలో గడిపితే ఒత్తిడి తగ్గుతుందట. వారంలో ఓ 30 నిమిషాల పాటు పార్కుల్లో, ప్రకృతి ఒడిలో ఉంటే ఒత్తిడి, మానసిక సమస్యల నుంచి కాస్త ఉపశమనం కల్గుతుందని ఆస్ట్రేలియాకు చెందిన తాజా అధ్యయనం పేర్కొంది. ప్రకృతిలోని చెట్ల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం ద్వారా.. శరీరానికి హాయిగా ఉండటంతో పాటు, గుండె సమస్యలు, బీపీ, ఇతర ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉంటుందని పరిశోధకులు తెలిపారు.
మరణాలకు మందులే కారణం..
అనారోగ్యంతో చనిపోయే వారికంటే డాక్టర్లు సూచించే తప్పుడు ట్యాబ్లెట్లు మనుషులు ఎక్కువగా చనిపోతున్నారట. గుండె సమస్యలతో బాధపడేవారిలో మూడో వంతు మరణాలకు తప్పుడు మందులే కారణమని అమెరికాకు చెందిన పరిశోధకులు తేల్చారు. 5 లక్షల మందిపై అధ్యయనం చేయగా 40శాతం మందికి ఇలాంటి లక్షణాలు ఉన్నాయట. ఇలాంటి మందుల వాడటం ద్వారా గుండెచప్పుడులో మార్పులొచ్చి గుండెసమస్యలకు దారితీస్తున్నాయట.
కాలు మీద కాలు వేస్తున్నారా?
క్లాస్ లుక్ కోసం చాలా మంది కాలు మీద కాలు వేసుకొని కూర్చొంటారు. కానీ అలా చేయడం అనారోగ్యానికి దారితీస్తుందట. మహిళలు అలా కూర్చుంటే కాళ్ల నొప్పులతో పాటు ఇతర వ్యక్తిగత సమస్యలు వస్తాయట. మగవాళ్లు ఎక్కువ సమయం ఇలా చేస్తే.. మోకాళ్ల నొప్పులతో పాటు పారాలసిస్ వచ్చే అవకాశముందట. దీంతో పాటు రక్త ప్రసరణలో మార్పులు వచ్చి మరింత అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Some Other Useful Yoga Aasans
google ads